Breaking News

కట్టుకున్నవాడిపై ఫిర్యాదు

Feb 12, 2018 21:03 by Admin Admin

పెళ్లయి ఆరుగంటలయ్యిందోలేదో... పెళ్లికూతురు అదే ముస్తాబుతో పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. తన భర్త వైభవ్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, చంపేస్తాననని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కట్నం డిమాండ్ చేస్తున్నాడని కూడా ఆరోపించింది. దీంతో సదరు కొత్త పెళ్లికొడుకును పోలీసులు అరెస్టు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూతన వధువు ఫిర్యాదుతో... వివాహం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వీరిని చూసిన వరుడు కంగుతిన్నాడు. పోలీసులు అతన్నిఅదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఈ వార్త సంచలనంగా మారింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe