Breaking News

లెక్కలేనన్ని ప్రయోజనాలు

Feb 12, 2018 21:09 by Admin Admin

 లంఖణం పరమౌషధం అంటుంటారు. ఉపవాసం చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ముందుగా దీనివలన వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ భాగాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఫలితంగా శరీరంలోని వివిధ ద్రవాలు సమతుల్యం చెందుతాయి. శరీరంలోపల క్లెన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. శరీరంలోని ఎంజైమ్ వ్యవస్థపై ప్రభావం చూపి, విషపదార్థాలను తొలగిస్తుంది. ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ తదితర సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఉపవాసం చేయడం అనేది మంచి పద్దతి. ఎందుకంటే ఉపవాసం వల్ల మనం తీసుకునే ఆహారం, అలవాట్లు జీవనశైలి, వీటన్నింటిలో మార్పులొస్తాయి. దీంతో శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల శక్తి తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు, పైగా శరీరంలో అనారోగ్యం కలిగినప్పుడు ఏర్పడిన విషపదార్థాలు తొలగిపోయి, శరీరంలో చురుకుదనం, ఉత్సాహం పెరుగుతుంది. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. రక్తంలో ఫ్యాట్ లెవల్స్ కరుగుతాయి. దాంతో హైబ్లడ్ ప్రెజర్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. సాధారణంగా వారానికోసారి ఉపవాసం ఉండటం ఉత్తమం. అయితే ఇటువంటప్పుడు పండ్లు, పండ్ల రసాలు, సలాడ్స్, నట్స్, పచ్చికూరగాయలు స్వల్ప మోతాదులో తీసుకోవాలి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe