Breaking News

వ్యభిచార ముఠా గుట్టురట్టు

Apr 07, 2018 23:05 by Admin Admin

నగరంలోని సరస్వతీనగర్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తుండగా సైదాబాద్‌ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు తల్లి, కుమారుడితో పాటు విటుడిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బాధిత యువతిని రెస్క్యూహోంకు తరలించారు. కృష్ణా జిల్లా కైకలూర్‌ మండలం వరహపట్నంకు చెందిన తాడిశెట్టి ధనలక్ష్మి(38), ఆమె కుమారుడు రవి(23) సరస్వతీనగర్‌లోని శ్రీదుర్గ ఎన్‌క్లేవ్‌ ఫ్లాట్‌-102లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సరూర్‌నగర్‌ అల్కాపురి కాలనీకి చెందిన గోపాల్‌ శ్రవన్‌కుమార్‌(39), దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాహుల్‌ అమ్మాయిలను తీసుకువచ్చేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం సైదాబాద్‌ పోలీసులు దాడిచేసి నిర్వహకులు ధనలక్ష్మి, రవి, విటుడు కామారెడ్డి జిల్లా బిర్కూర్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన జిల్లా విఠల్‌(19)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అమ్మాయిలను తీసుకొచ్చే శ్రవన్‌కుమార్‌, రాహుల్‌ పరారీలో ఉన్నట్లు సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య తెలిపారు. బాధిత యువతిని పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe