Breaking News

ఉద్యోగుల వేతన సవరణపై నిర్ణయం

Apr 13, 2018 19:05 by Admin Admin

 విద్యుత్తు ఉద్యోగులకు వేతన సవరణపై ఈనెల 24 తర్వాత నిర్ణయం తీసుకుంటామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి జగదీశ్‌రెడ్డిని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల సంఘం (1104) ప్రధాన కార్యదర్శి సాయిబాబు, అదనపు ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకర్‌ల నేతృత్వంలోని ప్రతినిధులు కలిశారు. పీఆర్‌సీతో పాటు ఈపీఎఫ్ ను రద్దు చేసి జీపీఎఫ్‌ కల్పించడం, ఆర్టిజాన్‌ల క్రమబద్ధీకరణతో పాటు అనేక సమస్యలపై చర్చించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు విదేశీ పర్యటనలో ఉన్నారని, ఈనెల 23న రాష్ట్రానికి తిరిగొచ్చాక ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బదులిచ్చారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe