Breaking News

యువకుడికి మూడేళ్ల జైలు

Apr 13, 2018 19:08 by Admin Admin

 బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. తీగలకుంటకు చెందిన ఇర్ఫాన్‌(28) 2016 మేలో నాలుగు సంవత్సరాల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి తండ్రి అమ్జద్‌ ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వాదనలు విన్న నాంపల్లి ఒకటో మెట్రో పాలిటన్‌ సెషన్‌ జడ్జి నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారని ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్‌ పులి యాదగిరి తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe