Breaking News

రేప్‌లు జరిగితేనే ఒక్క సినిమా: శ్రీరెడ్డి

Apr 14, 2018 20:10 by Admin Admin

 తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో రేప్‌లు జరిగితేనే ఒక సినిమా పూర్తవుతుందని వివాదాస్పద సినీతార శ్రీరెడ్డి అన్నారు. శనివారం ఏఐఎస్‌ఎఫ్‌ ఓయూ కౌన్సిల్‌ ఆహ్వానం మేరకు యూనివర్సిటీకి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తాను సినిమాల్లో అవకాశాల కోసం పోరాటం చేయడం లేదని, ఆడవాళ్లకు న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్నారు. ‘మా’లో చాలా లోపాలున్నాయని, ఓయూ విద్యార్థులు తనకు మద్దతుగా నిలవడం వల్లే ‘మా’ వెనక్కి తగ్గిందన్నారు. తాను ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని, తనపై విషప్రచారం చేస్తున్నారన్నారు. ‘గన్‌లో బులెట్లు రెడీగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరిమీదైనా పేలవచ్చు. ఇప్పుడు కాకపోయినా మరో పదేళ్లకైనా పేలుస్తా’ అన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe