Breaking News

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Apr 14, 2018 20:17 by Admin Admin

 వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి నిర్వాహకురాలిని ఇద్దరిని నల్లగొండ జిల్లా హాలియా పోలీసులు  అరెస్ట్‌ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ హాలియా పోలీస్ స్టేషన్‌లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హాలియాలోని అంగడి బజార్‌లో ఓ మహిళ వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని తనకు పరిచయం ఉన్న అమ్మాయిలకు ఆశలు చూపి వారిచేత వ్యభిచారం చేయిస్తోందన్నారు. ఈ క్రమంలో ఒక యువతీకి ఫొన్‌ చేసి హాలియాకు రమ్మని అదే విధంగా ఇద్దరు విటులను సాయంత్రం 6.30 గంటలకు రమ్మని వారివద్ద నుంచి 3వేల రూపాయలను తీసుకొని ముగ్గురిని ఇంట్లోకి పంపి నిర్వాహకురాలు బయట కాపలా కూర్చుందన్నారు. అదే సమయంలో పక్కా సమచారం అందుకున్న హాలియా సీఐ ధనుంజయ్‌గౌడ్‌ తమ పోలీస్‌ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. అమాయకులైన యువతులను ప్రలోభ పెట్టి ఇలాంటి వారు అవకాశం ఉందని వారి నుంచి అమ్మాయిలు జాగ్రత్త పడాలని సూచించారు. ఈ సందర్భంగా హాలియా సి.ఐ. ధనుంజయ్‌గౌడ్‌, ఎస్‌.ఐ. సతీష్ కుమార్‌ సిబ్బందిని అభినందించారు. ఈకేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు హాలియా సి.ఐ. ధనుంజయ్‌గౌడ్‌ తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe