Breaking News

తెలంగాణలో పెరిగిన ఎండలు

Apr 14, 2018 20:20 by Admin Admin

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడు రోజులుగా ఎండలు పెరిగిపోయాయి. శనివారం కొత్తగూడెంలో పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరింది. సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. దీంతో కాస్త ఉపశమనం లభిస్తోంది. ఏప్రిల్‌ మొదటి వారం వరకు ఎండలు పెరగలేదు. వర్షాలు, గాలిదుమారం వల్ల వాతావరణం చల్లబడింది. అయితే మూడు రోజుల నుంచి జిల్లాలో 39 నుంచి 41 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత పెరిగింది. సింగరేణి, కేటీపీఎస్‌, ఐటీసీ బీపీఎల్‌, నవభారత్‌, హెవీ వాటర్‌ ప్రాజెక్ట్‌ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో అదనంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది.

 
    దీంతో ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. కార్మికులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాలతోపాటు మండలాల్లో కొబ్బరి బోండాలు, శీతల పానీయాలకు డిమాండ్‌ పెరిగింది. పలు పట్టణాల్లో పోలీసు, రెవెన్యూ, మునిసిపల్‌ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల మధ్యాహ్నం ప్రయాణికులు బస్సుల్లో పెద్దగా ప్రయాణించడం లేదు. పలుచోట్ల ప్రజలు వడదెబ్బతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటీవల చుంచుపల్లి మండలం పెనుబల్లిలో ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఎండల తీవ్రతతో కూలర్లు, ఏసీలకు డిమాండ్‌ పెరిగింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe