Breaking News

భార్యను హత్య చేసిన భర్త

Apr 21, 2018 20:33 by Admin Admin

 చిన్నపాటి గొడవ కారణంగా క్షణికావేశానికి గురైన భర్త భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అస్సాంకు చెందిన పూలక్‌ బోరే, తూతూబోరే(28) భార్యాభర్తలు. వీరికి ఓ బాబు ఉన్నాడు. గత కొంతకాలం క్రితం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి కాటేదాన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో ఉంటున్నారు. పూలక్‌ బోరే కాటేదాన్‌లోని పారిశ్రామికవాడలో సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాడు. భర్త మద్యం తాగి ఇంటికి రావడంతో మూడురోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చిన్నపాటి గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన భర్త పూలక్‌ బోరే భార్య తలను గోడకు కొట్టడంతో తీవ్రగాయాలైన తూతూ బోరే మృతిచెందింది. ఇరుగుపొరుగు వారు చూస్తుండగానే అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారమందుకున్న మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పూలక్‌బోరేను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe