Breaking News

పది ఫలితాల్లో ముందున్న పాఠశాలలకు ప్రోత్సాహకాలు

May 04, 2018 20:35 by Admin Admin

 వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో పది ఫలితా ల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు కలెక్టర్‌ అమ్రపాలి ప్సోత్సాహకాలు ప్రకటించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో మండల విద్యాధికారు లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 100శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్‌ తదితర పాఠశాలలకు రూ. 2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని, అలాగే 10/10 జీపీఏ సాధించిన పాఠశాలకు రూ. 3 లక్షలు ఇస్తామని ఆమె పేర్కొన్నారు.

 
వంద శాతం ఫలితంతోపాటు 10/10 జీ పీఏ సాధించిన పాఠశాలకు రూ.5లక్షలు ప్రో త్సాహకం అందిస్తామని ఆమె వెల్లడించారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే 100 శాతం ఫలితాల సాధన కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలని ఆమె సూచించారు. గణితం, సై న్స్‌, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతున్నారని ఆయా సబ్జెక్టు ల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణతో పా ఠ్యాంశాలు బోధించాలని సూచించారు.
 
ప్రభుత్వ పాఠశాలల్లో 80 శాతం హాజరు లేని విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను నిలిపివేసేలా చర్యలు చేపడుతామని ఆమె పేర్కొన్నారు. అర్బన్‌ జిల్లా పరిధిలో బడి బయట ఉన్న 346 మంది పిల్లలను బడుల్లో, బ్రిడ్జి స్కూళ్లలో చేర్పించాలని ఆమె ఎంఈవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సెక్టోరల్‌ అధికారులు ఎం. వేణుఆనంద్‌, బి. మనోజ్‌కుమార్‌, డి. రమాదేవి, ఎన్‌సీఎల్‌పీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe