Breaking News

పార్టీ పెట్టట్లేదు: రేవంత్

May 12, 2018 10:33 by Admin Admin

 తాను కొత్తపార్టీ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆపార్టీలో ఇమడలేకపోతున్నారని, తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం అవ్వాలనే సంకల్పంతో ఉన్న రేవంత్ రెడ్డి.. తానే స్వయంగా పార్టీ పెట్టి కేసీఆర్‌కు ఎదురెళ్లాలని భావిస్తున్నారని, త్వరలోనే కొత్త పార్టీ పెడతారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇది కాస్తా బిగ్ న్యూస్ కావడంతో రేవంత్ దీనిపై స్పందించారు. అవన్నీ గాలి వార్తలంటూ కొట్టిపారేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe