Breaking News

అమిత్‌షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళిన కన్నా లక్ష్మీనారాయణ

May 14, 2018 00:20 by Admin Admin

 కార్యదీక్ష, అంకితభావంతో పనిచేసే నైజం ఉన్నందువల్లే ఆనాడు కాంగ్రెస్‌లో కానీ ప్రస్తుతం బీజేపీలో కానీ ఎవరికీ దక్కనంతటి గుర్తింపు కన్నా లక్ష్మీనారాయణ లభించింది. గ్రూపు రాజకీయాలకు కొదవే లేని కాంగ్రెస్‌లో ఆయన చిన్నవయసులోనే అడుగుపెట్టి నిలదొక్కుకోవటమే కాదు.. జిల్లాలో దశాబ్ధకాలం తిరుగులేని అధి కారం చెలాయించారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, కోట్ల విజ యభాస్కరరెడ్డి సీఎం అయినా, రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య మంత్రులైనా వారి కేబినెట్‌లో ఆయనకు పెద్దపీట వేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎంత మంది ఉన్నా పంద్రాగస్టుకు పతాకం ఎగురవేసే అరుదైన అవకాశం మాత్రం అయనకే ఏ ముఖ్యమంత్రి అయినా కల్పించేవారు.

 
 
వరుసగా జిల్లాలో పదేళ్ళ పాటు ఆగస్టు 15 వేడుకల్లో అధికారికంగా జాతీయ పతాకం ఎగురవేసే అవకాశాన్ని ఆయనే అందిపుచ్చుకొని రికార్డు సృష్టించారు. వేరే పార్టీలో నుంచి వచ్చిన వారికి బీజేపీలో ఎట్టి ప రిస్థితుల్లోనూ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్ప గిం చే ఆనవాయితీ లేదు. అయితే ప్రస్తుతం రా ష్ట్రంలో నెలకొన్న పరి స్థితుల దృష్ట్యా జనం, గళం ఉన్న కన్నా లాం టి నాయకుడి అవ సరం ఉందని గుర్తించే నియమావళిని సైతం పక్కన పెట్టి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆయనకు జనంలో ఉన్న ఇమేజ్‌ కారణంగానే పార్టీ మారటాన్ని ఇష్టపడక బీజేపీ అధిష్టానం బుజ్జగించి అడ్డగించింది. అదే సమయంలో అటు వైసీపీ అతనికే కాకుండా అతని అనుచరుడుకు కూడా సీటు ఇచ్చేందుకు అంగీకరించి ఆయన్ను స్వాగతిస్తూ కార్పెట్‌ పరిచింది. అంతేకాదు గతంలో రాజకీయంగా కన్నా పొడ కూడా గిట్టని తెలుగుదేశం శ్రేణులు, ముఖ్యులు సైతం ఆయనను పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని స్వాగతించారు.
 
 
కన్నాకు పెను సవాల్‌...
బీజేపీ ప్రభుత్వం పట్ల ఎంతో వ్యతిరేకత ఉన్న సమయంలో ఆయన జనంలోకి ఎలా వెళతారు. పార్టీని ఏ విధంగా రాష్ట్రంలో బలోపేతం చేస్తారు...వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్ధులను నిలిపి గెలుపు సాధిస్తారు...అనేది ప్రశ్నార్ధకం. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగి ఒక దశలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలిసినా ఆ పార్టీనే అంటిపెట్టుకొని ఉండి పరాజయం పాలైన తర్వాత బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరి కొద్దికాలమే అయినప్పటికీ అంకితభావంతో పనిచేస్తూ పెద్దల దృష్టిని ఆకర్షించారు.
 
విద్యార్థి దశ నుంచే యువజన కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన కన్నా లక్ష్మీనారాయణ 1989 ఎన్నికల్లో పెద కూరపాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగటం ద్వారా జిల్లా రాజకీయాల్లో తన ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అదే నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలుపొందారు. 2009 ఎన్ని కల్లో సొంత నియోజకవర్గమైన గుంటూరు పశ్చిమ నుంచి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగి కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రభంజనంలో ఓటమిని చవిచూడక తప్పలేదు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe