Breaking News

జానకీ మందిర్‌ గురించి

May 14, 2018 00:21 by Admin Admin

 నేపాల్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వల్ల చాలా మందికి అక్కడ ఉన్న జానకీ మందిర్‌ గురించి తెలిసింది. ఇంతకీ ఏమిటా ఆలయం ప్రత్యేకత? చూద్దాం..

జానకీ మందిర్‌.. సీతమ్మ పుట్టిల్లు మిథిలారాజ్యం(నేటి నేపాల్‌లోని జనక్‌పూర్‌)లో నెలవైన ఆలయం. ఆ జగదానంద కారకుడి పట్టమహిషి కొలువైన మందిరం. స్థలపురాణం ప్రకారం జనక మహారాజు ఏలిన నేల ఇది. సీతమ్మతల్లి జనకుడికి లభ్యమైన చోటు ఇదేనని.. రామయ్యను పెళ్లాడి అయోధ్యకు వెళ్లేదాకా ఈ నేలపైనే నడయాడిందని ఐతిహ్యం. అందుకు నిదర్శనంగా.. 1657లో ఈ ప్రాంతంలో ఒక స్వర్ణ సీత విగ్రహం దొరికింది. ఈ ఆలయానికి సమీపంలో ‘వివాహ మండప్‌’ పేరుతో ఒక గుడి ఉంటుంది. సీతారాముల పెళ్లి జరిగింది అక్కడేనని భక్తుల నమ్మిక. జానకీ మందిర్‌ను నేపాలీలు ‘నౌ లఖా మందిర్‌’గా వ్యవహరిస్తుంటారు. నౌ లఖా అంటే తొమ్మిది లక్షలు. 150 అడుగుల ఎత్తుండే ఈ మూడంతస్తుల గుడిలో 60 గదులుంటాయి. రాణి వృషభాను 1910లో దీన్ని నిర్మింపజేసింది. ఈ ఆలయ నిర్మాణానికిఅయిన ఖర్చు.. 9,99,900. అందుకే ‘నౌ లఖా మందిర్‌’ అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు నేపాల్‌ నలుమూలల నుంచే కాక.. భారత్‌, శ్రీలంక తదితర దేశాల నుంచి వేలాది భక్తులు వస్తుంటారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe