Breaking News

వీర్రాజును అధ్యక్షుడిగా ప్రకటించాలి..

May 14, 2018 00:21 by Admin Admin

 సాయంత్రంలోగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించకపోతే బీజేపీ జిల్లా కార్యవర్గం మొత్తం రాజీనామాలు చేస్తామని బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దశాబ్దాలుగా పార్టీలో కష్టపడుతున్న నేతను మరిచారని, మొన్న పార్టీలోకి వచ్చి నిన్న వైసీపీలోకి వెళ్లేందుకు యత్నించిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించడం దౌర్భాగ్యమన్నారు. అలాగే సాయంత్రం విజయవాడలో రాష్ట్ర పార్టీ నేతల సమావేశం జరగనుందని, ఈలోగా వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించకపోతే నాయకులంతా రాజీనామా చేస్తారని మాలకొండయ్య పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe