Breaking News

ఆర్‌సీబీ ఈజీ విక్టరీ

May 14, 2018 10:04 by Admin Admin

 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టుకు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 88 పరుగలకే ఆలౌట్ చేశారు. అయితే 89 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని చేధించింది. పార్థివ్ పటేల్, కోహ్లీల జోడీ తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ జట్టుకి విజయాన్ని కట్టబెట్టింది. విరాట్ కోహ్లీ(44), పార్థివ్(40) నిలకడైన భాగస్వామ్యంతో ఈ సీజన్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది. కేవలం 8.1 ఓవర్లలోనే 92 పరుగులు చేసి ఈ సీజన్‌లో మరో విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్ ఆశల్ని సజీవం చేసుకుంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe