Breaking News

తర్వాత ఎన్టీఆర్‌తోనే..

May 14, 2018 10:07 by Admin Admin

 చాలా గ్యాప్ తర్వాత మహానటి చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వైజయంతీ మూవీస్.. ఇకపై వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దిల్ రాజుతో కలిసి మహేష్ 25వ చిత్రాన్ని నిర్మిస్తున్న అశ్వనీదత్.. ఈ చిత్రం అనంతరం యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో మూవీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

 
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇకపై మా వైజయంతీ బ్యానర్‌లో వరుసగా సినిమాలు నిర్మిస్తాం. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా పూర్తవ్వగానే ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాము. పెద్ద హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతో కూడా ఇకపై వరుసగా మా బ్యానర్‌లో సినిమాలు వస్తాయి..’’ అని తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe