Breaking News

ఇంత లోపే: అల్లు అరవింద్

May 14, 2018 10:08 by Admin Admin

 ‘మహానటి’ సినిమా ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, వంశి పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, పరుచూరి గోపాల కృష్ణ, జెమినీ కిరణ్, కె.ఎస్.రామారావు, రమేష్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్ రావు, డా. గోపిచంద్, నందిని రెడ్డి, సంపత్ నంది, త్రినాధ్ రావు నక్కిన, విజయ్ కుమార్ కొండా, కరుణాకరన్, బి.వి.ఎస్.యన్ ప్రసాద్ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మహానటి దర్శకులు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, ప్రియాంకదత్, స్వప్నదత్ లపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి గారి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ మరియు ముఖ్య పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు.

 
 
అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘మహానటి సావిత్రి గారిని తెర మీద ఇంత అద్భుతంగా చూపించి తెలుగు ప్రేక్షకులను పులకరింపచేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతి మరింత పెంచిన దర్శకుడిని, నిర్మాతలను అభినందించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. కీర్తి సురేష్ మహానటి సావిత్రి గారిలా అద్భుతంగా చేసింది. నిన్నటికి నిన్న బాహుబలి వంటి చరిత్రాత్మక చిత్రంతో తెలుగు సినిమా అంటే ఇదిరా అని రొమ్ము విరుచుకుని చెప్పుకున్నాం.. అది ఇంకా మర్చిపోలేదు.. ఇంత లోపే ఒక డిఫరెంట్ జానర్‌తో మహానటి మళ్ళీ అంతే ఫీలింగ్ ఇచ్చింది. ‘నా పేరు సూర్య’కు పోటీగా ఉన్నాయి కలెక్షన్స్ అనుకుంటుంటే, ‘మహానటి’ తెలుగు సినిమా విజయం మనం సెలెబ్రేట్ చేసుకోవాలి డాడీ అని బన్నీ అన్నాడు. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ప్రేక్షకుడు ‘మహానటి’ని తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఒక సినిమా మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో ఇది ఉదాహరణ. తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా ఇది’’ అన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe