Breaking News

నా పాత్ర తీసేయడం బాధించింది: హీరోయిన్

May 14, 2018 10:09 by Admin Admin

 హానటి’ సినిమా ద్వారా అలనాటి అందాల తార సావిత్రి జీవితకథను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంటోంది.

 
 
కాగా మహానటి సావిత్రి జీవితంలోని పలు కీలక సంఘటనలు చూపించే క్రమంలో సినిమా నిడివి కూడా ఎక్కువగానే తీసుకున్నారు. నిజానికి షూట్ చేసిన అన్ని సీన్స్ గనక చూపించి ఉంటే ఈ సినిమా నిడివి మరింత ఎక్కువగా ఉండేదట. ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్ కత్తెర పెట్టేశారు. జెమినీ గణేశన్ రెండవ భార్య పుష్పవల్లి క్యారెక్టర్ చేసిన నటి బిందు చంద్రమౌళి సన్నివేశాలు కూడా కత్తెర చేయబడ్డాయి. ఈ విషయమై స్పందించిన బిందు చంద్రమౌళి.. ఇలా చేయడం తనకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా.. చిత్రంలో కట్ చేసిన తన సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.
 
 
‘‘పుష్పవల్లి, ఆమె కుమార్తె పాత్రలు కట్ చేశారని తెలిసి చాలా బాధపడ్డా. అయినా పర్వాలేదు. ఒక సినిమా నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోగలను. గతంలో నా సినిమా విషయంలో చాలాసార్లు ఇలా జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఎంతో నిరాశకు గురయ్యాను. ‘మహానటి’ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఓ చక్కటి అనుభూతిని ఇచ్చింది. నిజ జీవిత పాత్రను పోషించే అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. ప్రత్యేకించి దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి నటించడం, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంకను కలవడం చాలా సంతోషం కలిగించింది. నా పాత్ర తెరపై కనిపించనప్పటికీ.. చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో నా పాత్ర కూడా ఉందనే నేను భావిస్తున్నా’’ అని పేర్కొంది బిందు చంద్రమౌళి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe