Breaking News

ట్రోల్ చేస్తున్న అభిమానులు

May 14, 2018 10:09 by Admin Admin

 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. డక్‌లు మీద డకౌట్లు అవుతూ రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబై స్కిప్పర్ గోల్డన్ డక్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఇది మూడోది. గత పది సీజన్లలో ఒక్కసారి కూడా డకౌట్ కాని రోహిత్ ఈసారి పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.

 
 
రోహిత్ డకౌట్లపై ట్విట్టర్‌లో సెటైర్లు పేలుతున్నాయి. ఓ యూజరైతే.. రోహిత్ వద్ద ఇప్పటికే బోల్డన్ని ‘డక్’లు ఉన్నాయి కాబట్టి చక్కగా ఓ పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవడం బెటరని కామెంట్ చేశాడు. ఈ ఏడాది రోహిత్ సగటు కంటే హార్దిక్ పాండ్యా ఎకానమీ రేట్ ఎక్కువని మరో యూజర్ ట్వీట్ చేశాడు. రోహిత్ ప్రతిభపై అభిమానులు సందేహం వ్యక్తం చేసినప్పుడల్లా మెరుపు వేగంతో డకౌట్ అయి వెనక్కి వస్తున్నాడని మరో నెటిజన్ సెటైర్ వేశాడు. రాజస్థాన్ రాయల్స్‌పై రోహిత్ సగటు 20 మాత్రమేనని మరొకరు గుర్తు చేశారు. రోహిత్ శర్మ ఫేవరెట్ పక్షి ‘డక్’ అని ఒకరు, ముంబైలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ గోల్డెన్ డక్ అయితే, జైపూర్‌లో డైమండ్ డక్ అని మరొకరు ఎద్దేవా చేశారు. ఇలా పలు రకాల కామెంట్లతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe