Breaking News

విరాట్‌కి అనుష్క చిరు కానుక

May 14, 2018 10:10 by Admin Admin

 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన సతీమణి అనుష్క శర్మ చిరు కానుక అందించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం తన భర్తకు మద్దతు తెలుపుతూ ఓ ప్రత్యేకమైన టీ షర్టు ధరించింది. గ్రే రంగులో ఉన్న ఈ టీ షర్టుపై విరాట్ కోహ్లీ పేరుతో పాటు అతని జెర్సీ నెం.18 కూడా ముద్రించి ఉంది. దీనికి సంబంధించిన ఫోటోని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి ‘‘కామన్ బాయ్స్’’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టింది. కాగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన కోహ్లీ సేన.. పంజాబ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు మార్గం సులభం అవుతుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe