Breaking News

కతువాలో హైఅలర్ట్

May 14, 2018 10:11 by Admin Admin

 ప్రధాని మోదీ ఈనెల 19న జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కతువాలో హైఅలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కదలికను భద్రతా బలగాలు పసిగట్టడంతో హైఅలర్ట్ ప్రకటించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాబోయే మూడు నాలుగు రోజుల్లో గాలింపు చర్యలు, కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదుల కదలికపై మాట్లాడుతూ, సరిహద్దులు దాటేందుకు వారు ప్రయత్నించారా, తిరిగి వెనక్కి వెళ్లిపోయారా అనేది తాము కచ్చితంగా చెప్పలేమన్నారు. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు బ్యాగులు ధరించి కతువా జిల్లా బోర్డర్ ఫెన్స్ వద్ద తచ్చాడుతున్నట్టు బీఎస్ఎఫ్ గమినించిందని, వెంటనే హైఅలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కతువా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీధర్ పటేల్ మీడియాకు తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe