Breaking News

బీసీలకు 60శాతం సీట్లు: నల్లా

May 14, 2018 10:14 by Admin Admin

 తెలంగాణలో నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయం బిఎల్ఎఫ్ మాత్రమేనని బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బీఎల్ఎఫ్ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఆర్ఏస్, కాంగ్రెస్ విధానాలకు ఎటువంటి తేడా లేదని, 2019లో అన్నీ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు బిఎల్ఎఫ్ పోటీ చేస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 60శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తామని, తెలంగాణలో బిఎల్ఎఫ్ నిశ్వబ్ద విప్లవం సృష్టిస్తోందని అన్నారు. సామాజిక న్యాయం ఎజెండానే ప్రధాన అంశంతో బీఎల్ఎఫ్ ప్రజల్లోకి వస్తుందన్నారు.

 
 
 
మే, జూన్, జూలై నెలల్లో అన్నీ స్థాయిల్లో బిఎల్ఎఫ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశంలో ఇప్పటికీ నివాసం, నీరు, నిరుద్యోగ సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. కేరళలో అమలవుతున్న అభివృద్ధి మోడల్ తెలంగాణలో కూడా రావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీల నుండి బీఎల్ఎఫ్ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe