Breaking News

తుది విడత కౌన్సెలింగ్‌ రేపటి నుంచే

May 14, 2018 10:15 by Admin Admin

 పీజీ వైద్య విద్యలో కాంపిటేటివ్‌ అథారిటీ కోటాలో మిగిలిపోయిన సీట్లకు తుది విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 15 నుంచి జరగనుంది. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి 16 మధ్యాహ్నం 12 గంటల వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని, 16నే సీట్ల కేటాయింపు జరుపుతామని పేర్కొంది. కాగా ఆలిండియా కోటా కింద ఇతర చోట్ల సీటు పొందిన విద్యార్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపింది. కౌన్సెలింగ్‌లో తమ ఆసక్తి మేరకు కోరుకున్న విభాగంలో సీటు పొంది చేరకపోతే వారిని పీజీ వైద్య విద్య నుంచి మూడేళ్లపాటు డిబార్‌ చేస్తామంది. వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధిస్తామని ప్రకటించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe