Breaking News

నోట్లతో కొత్త కష్టాలు

May 14, 2018 10:16 by Admin Admin

 పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరెన్సీ కష్టాలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అనంతరం కొత్త నోట్ల సర్దుబాటుతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఇప్పుడు మరో చిక్కు కలవరపెడుతోంది. ఆర్‌బీఐ తాజాగా ప్రవేశ పెట్టిన రూ.200, రూ.2000 నోట్లు పాడైనా, మాసిపోయినా ఎక్చెంజ్‌కు అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఆర్‌బీఐలో ఉన్న పాత నిబంధనల వల్లే ఈ సమస్య వచ్చిందని, ఈ నిబంధనను త్వరితగతిన మార్చాలని బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

 
 
ఆర్‌బీఐ ‘నోట్ రీఫండ్’ చట్టం ప్రకారం100, రూ .500, 1,000, రూ .5,000, రూ. 10,000 విలువ గల నోట్లకు మాత్రమే మార్పిడికి అవకాశం ఉంది. అయితే ఆర్‌బీఐ ఈ చట్ట నిబంధనల్లో కొత్తగా మార్పులు చేపట్టకపోవడంతో కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.200, రూ.2000 నోట్లు మార్చుకునే అవకాశం లేదు. దీంతో ఎక్చేంజ్ కౌంటర్లలో పాడైన, మాసిపోయిన రూ.200, రూ.2000 నోట్లు పేరుకుపోతున్నాయి. దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని ఆర్‌బీఐ ముందు వివిధ బ్యాంకులు వాపోతున్నాయి. అయితే, ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్‌బీఐ చెబుతోంది. వెంటనే రూ.200, రూ.2000 నోట్లను కూడా ‘నోట్ రీఫండ్’ చట్టంలో చేర్చి మార్పుకు అనుమతి ఇవ్వాలని ఆ నివేదికలో పేర్కొన్నామని ఆర్‌బీఐ తెలిపింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe