Breaking News

చిందేయనున్న బాలీవుడ్ స్టార్లు!

May 21, 2018 04:04 by Admin Admin

 ఐపీఎల్ ఫైనల్‌ను అదిరిపోయేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రెండు గంటల పాటు ప్రదర్శన ఇవ్వనున్నాడు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్ అహుజా తదితరులు కూడా వేదికను పంచుకోనున్నారు. ఐపీఎల్ క్వాలిఫయర్ 1, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.

 
దేశంలోని క్రికెట్ ఔత్సాహికులను ఆకర్షించేందుకు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మరాఠీ, మలయాళం బ్రాడ్‌కాస్టర్లు కూడా ముందుకొచ్చారు. మరాఠీ బ్రాడ్‌కాస్టర్లు నిర్వహించే సంబరాల్లో మాధురీ దీక్షిత్, స్వప్నిల్ జోషి పాల్గొననున్నారు. ఈసారి ఐపీఎల్‌లో హిందీ, ఇంగ్లిష్‌తోపాటు తమిళ్, తెలుగు, బెంగాలీ, కన్నడ భాషల్లో కామెంటరీ అందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
 
మంగళవారం తొలి క్వాలిఫైర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుండగా, 23న క్వాలిఫయర్ 2 స్థానం కోసం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైటర్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్ 2 మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే జరగనుండగా, ఈనెల 27న ముంబలో ఫైనల్ జరగనుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe