Breaking News

మరోసారి హెచ్చరించిన హసీన్

Mar 08, 2018 11:44 by Admin Admin

 టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. అతడి కోసం తనెన్నో త్యాగాలు చేశానని, తనకు ఇష్టమైన మోడలింగ్ కెరీన్‌ను వదులుకున్నాని పేర్కొన్నారు. 2012లో తామిద్దరం తొలిసారి కలుసుకున్నామని, అంతకుముందు షమీ తన బంధువుల అమ్మాయిని ఐదేళ్లపాటు ప్రేమించాడని తెలిపారు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని భావించాడని, అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని హసీన్ వివరించారు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చినప్పటి నుంచి తనపై వేధింపులు ఎక్కువయ్యాయని, తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రెండేళ్ల నుంచి విడాకులు ఇవ్వాలని కోరుతున్నాడని, అయితే తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన ఆస్తి, బీమా పత్రాలు షమీ వద్దనే ఉన్నాయని పేర్కొన్న హసీన్ అతడిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe