Breaking News

విధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన

Mar 12, 2018 19:56 by Admin Admin

 ఏపీ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. విధి విధానాలను 4వారాల్లో, విభజన ప్రక్రియను 8 వారాల్లో పూర్తి చేయాలని ఇరురాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలకు ఉత్తర్వులు జారీచేసింది. ఏసీజే రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశిచింది, విభజన ప్రక్రియ పూర్తి చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. నగరంలోని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌.సుజాత, డిప్యూటీ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన డాక్టర్‌ సుబ్బరాములు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe