Breaking News

పెద్దమనుషుల హామీతో ఆందోళన విరమణ

Mar 12, 2018 19:58 by Admin Admin

 రెండు రోజుల క్రితం మృతి చెందిన మాలవేన సంధ్య అనే వివాహిత మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు భర్త మాలవేన చంటి అలియాస్‌ సంతోష్‌ ఇంటి ఎదట  ఆందోళన చేపట్టారు. మండలంలోని రచ్చపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని అడ్యాలకు చెందిన మాలవేని సంధ్య(25) హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయింది. గత సోమవారం రాత్రి సంధ్య మంటలు అంటుకొని గాయపడగా కుటుంబ సభ్యులు చి కిత్స కోసం హైదరాబాద్‌కు త రలించారు. తీవ్రంగా గాయ పడిన సంధ్య ఆసుపత్రిలో చి కిత్స పొందుతూ మృతి చెం దింది. భర్త చంటి, ఆత్తమామలు రాజేశ్వరి, బానయ్య త న సోదరిని అదనపు కట్నం కోసం కిరోసిన్‌ పోసి అంటిం చారని సంధ్య సోదరుడు నరెడ్ల సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 
సంధ్య మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని మృతదేహంతో కుటుంబసభ్యులు, బం ధువులు ఆందోళన చేశారు. అదనపు కట్న కోసం కొంతకాలంగా సంధ్యను భర్త, అత్తమామలు వేధించేవారని, ఇందులో భాగంగానే కిరోసిన్‌ పోసి నిప్పంటించారని ఆసుపత్రిలో చనిపోయే ముందు సంధ్య తమకు చెప్పిందని తల్లి స్వరూప కన్నీటి పర్యంతమైంది. సంధ్య మృతికి కారకుడైన చంటిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.
 
ఆదివారం ఆర్థరాత్రి తర్వాత సంధ్య మృతదేహంతో గ్రామానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న సీఐ నటేష్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఉపేందర్‌రావు అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఇరువర్గాలకు చెందిన పెద్ద మనుషులు జ్యోకం చేసుకొని సంధ్య కుమారులకు న్యాయం చేయడానికి ఒప్పందం కుదర్చడంతో ఆందోళన విరమించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం మడిపెల్లిగూడెంకు చెందిన సంధ్యకు అడ్యాలకు చెందిన మలవేన చంటితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe