Breaking News

దర్శించుకున్న రాజ్యసభ అభ్యర్థులు

Mar 12, 2018 19:58 by Admin Admin

 కనకదుర్గమ్మను సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, సభ్యులు వెలగపూడి శంకరబాబు, జి.పద్మశేఖర్‌, సూర్యలత కుమారి, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అమ్మవారి చిత్రపటం, అమ్మవారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం బహూకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సి.ఎం.రమేష్‌ దంపతులు, కనక మేడల రవీంద్ర కుమార్‌ దంపతులు ఉన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe