Breaking News

శ్రీదేవిది హత్యే!

Mar 18, 2018 19:55 by Admin Admin

 ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్‌ అన్నారు. సన్నిహితులే శ్రీదేవిని చంపారని శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరులోగా ఎన్నికలు జరిగితే నరేంద్రమోదీకి అనుకూల ఫలితాలు వస్తాయని తెలిపారు. ‘తెలంగాణలో 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం దక్కుతుంది.

 
మూడో ఫ్రంట్‌ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిసా, బిహార్‌లో బీజేపీకి సీట్లు కనీసం సగానికి తగ్గుతాయి. సీమాంధ్ర, తెలంగాణల్లో బీజేపీకి ఒక లోక్‌సభ సీటు కూడా దక్కదు. రజనీకాంత్‌ రాజకీయాల్లో రాణిస్తాడు’ అంటూ రాజకీయాల గురించి రామలింగేశ్వర వరప్రసాద్‌ వివరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe