Breaking News

సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి

Aug 04, 2018 17:29 by Admin Admin

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు.  అంతరిక్షంలోకి వెళ్లనున్న మొత్తం 9 మంది వ్యోమగాముల తాజా తుది జాబితాలో సునీతా పేరు కూడా నాసా ప్రకటించింది.  వచ్చే ఏడాది కమర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్సను అమెరికా అంతరిక్షంలోకి ప్రయోగిస్తోంది. ఈ వాహనాన్ని రూపొందించేందుకు నేషనల్ ఏయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కొన్నేళ్లపాటు కృషిచేస్తోంది.  స్పేస్‌ఎక్స్, బోయింగ్ సంయుక్తంగా రూపొందించిన రాకెట్, క్యాప్సూల్స్‌లో తొలిసారి మనుషులను అంతరిక్షంలోకి పంపుతుండగా 2011 తరువాత తొలిసారి మనుషులను తీసుకె ళుతుండడం మరో విశేషం.

అమెరికా నేలపై నుంచి, అమెరికా రాకెట్లో, అమెరికన్ వ్యోమగాములను పంపే అంకం తుదిద శకు చేరుకున్నట్టు ‘లాంచ్ అమెరికా’ను నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టేన్ అభివర్ణించారు.  ఈ ఆపరేషన్ విజయవంత మైతే అంతరిక్షంలోనూ అమెరికా అగ్రగామి అవుతుందని నాసా అభిప్రాయపడింది.  52 ఏళ్ల సునీతా విలియమ్స్‌తో పాటు జోష్ కసాడా అనే మరో 45 ఏళ్ల మహిళా ఆస్ట్రోనాట్ కూడా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.  సునీతా 321 రోజులపాటు అంతరిక్షంలోనే ఉండి పరిశోధనలు పూర్తిచేసుకుని విజయవంతంగా 2012లో తిరిగి భూమి పైకి వచ్చారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe