Breaking News

ఆ యంత్రాలను ఎలా హ్యాక్‌ చేయొచ్చో చూపించారు

Aug 11, 2018 18:40 by Admin Admin

పీఓస్‌.. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌.. నోట్ల రద్దు తర్వాత ఈ వ్యవస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా డిజిటల్‌ చెల్లింపులకు క్రమంగా అంతా అలవాటుపడ్డారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఈ టెక్నాలజీకి తదుపరి తరం అయిన మొబైల్‌-పీఓఎస్‌ వల్ల హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. అమెరికాలోని లాస్‌వెగా్‌సలో జరుగుతున్న ‘బ్లాక్‌హ్యాట్‌ యూఎ్‌సఏ’ సదస్సులో గురువారం ప్రఖ్యాత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ పాజిటివ్‌ టెక్నాలజీస్‌ ఎం-పీఓఎ్‌సలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. ఈ సంస్థ పరిశోధకులు టిమ్‌ యునుసోయ్‌, లైఘ్‌-అన్నే గాల్లోవేలు ప్రపంచవ్యాప్తంగా ఎం-పీఓఎస్‌ తయారీదారులు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో లోపాల(వల్నరబిలిటీ్‌స)ను ఎత్తి చూపుతూ.. ఆ యంత్రాలను ఎలా హ్యాక్‌ చేయొచ్చో చూపించారు.
 
‘హ్యాకర్లు బ్లూటూత్‌ ద్వారా ఈ మొబైల్‌ అప్లికేషన్‌లోకి సులభంగా దూరిపోగలరు. ఆ తర్వాత.. డిజిటల్‌ చెల్లింపులను మధ్యలోనే నియంత్రించగలరు. నిధులను దారి మళ్లించగలరు. అంతేకాదు.. ఎం-పీఓఎ్‌సలో స్వైప్‌ చేసిన కార్డుల డేటాను తస్కరించే ప్రమాదం కూడా ఉంది’ అని వివరించారు. ‘ఈ యంత్రాల్లో మాగ్నెటిక్‌ స్ర్టిప్‌ ఉన్న కార్డుల ద్వారా స్వైప్‌ చేయడం చాలా ప్రమాదకరం. చిప్‌కార్డుల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అయినా.. వాటి డేటాను సైబర్‌ ముష్కరులు తస్కరించగలరు’ అని ఎం-పీఓఎస్‌ తయారీదారులను హెచ్చరించారు. ప్రస్తుతం తమ సంస్థ ఆయా అప్లికేషన్లలో ఉన్న లోపాలకు ప్యాచ్‌ (విరుగుడు) కనుగొంటోందని తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe