Breaking News

టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది

Sep 03, 2018 18:01 by Admin Admin

బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో పరిమిత కాల ఆఫర్ కింద తన వ్యవస్థలో ఉన్న ఏ గమ్యస్థానానికైనా వన్‌వే జర్నీ టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది. దాన్ని ఆల్ ఇన్‌క్లూజివ్ ధరగా కంపెనీ పేర్కొంది. మొత్తం 10 లక్షల సీట్లను అది ఈ రకంగా అమ్మకానికి పెట్టింది.  గురుగ్రామ్ కేంద్రంగా ఉన్న ఈ విమానయాన సంస్థ ప్రమోషనల్ ఆఫర్ కింద టికెట్‌ను మొబైల్ వాలెట్ ప్రొవైడర్ మొబిక్విక్ ద్వారా బుక్ చేసుకుంటే రూ. 600 (20 శాతం) వరకు సూపర్ క్యాష్ ఎమౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. 2018 సెప్టెంబర్ 18 నుంచి 2019 మార్చి 30 వరకు చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ‘‘పండుగ అమ్మకాల’’ కింద నాలుగు రోజుల టికెట్ల విక్రయం సోమవారం మొదలైందని ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి విలియం బౌల్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్లను ముందుగా విక్రయించడం వల్ల విమానయాన సంస్థకు చర మూలధనం లభిస్తుంది. ఈ బడ్జెట్ విమానయాన సంస్థ చౌక ధరలకు పది లక్షల సీట్లను అమ్మకానికి పెట్టడం ఇది రెండోసారి. గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంతో పోల్చుకుంటే, వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ లాభదాయకత దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఇదే రకమైన ఆఫర్ కింద సంస్థ జూలైలో రూ. 1212 ప్రారంభ ధరకు 1.2 మిలియన్ సీట్లను అమ్మకానికి పెట్టింది. ఇండిగోను రాకేశ్ గంగ్వాల్, రాహుల్ భాటియాలను ప్రమోట్ చేస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థ నిర్వహిస్తోంది. విదేశీ మారక ద్రవ్య ప్రతికూల ప్రభావం, అధిక చమురు ధరల వల్ల ఈ జూన్ త్రైమాసికంలో ఇండిగో నికర లాభం ఏకంగా 96.6 శాతం తగ్గి రూ. 27.8 కోట్లుగా నమోదైంది. కంపెనీ 2017-18 ఆర్థిక సంవత్సరం క్యూ 1లో రూ. 811 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. లాభదాయకత తరిగిపోవడంతోపాటు ఈ సంస్థను మరో సమస్య కూడా వేధిస్తోంది. సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 నయా విమానాల్లో ప్రాట్ అండ్ విట్నే ఇంజన్లు అమర్చారు. ఇంజన్‌లో సాంకేతిక లోపాల వల్ల విమానాలను తరచు  పక్కనపెట్టవలసి వస్తోంది. స్పేర్ ఇంజన్ల కోసం ఎదురు చూస్తూ,  ఇండిగో గత జూలై నెలాఖరులో ఐదు ఎ320 విమానాలను పక్కన పెట్టింది. ఇండిగో 160 విమానాలతో  రోజూ 52 గమ్యస్థానాలకు 1100 విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. వాటిలో ఎనిమిది అంతర్జాతీయ లైన్లు కూడా ఉన్నాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe