Breaking News

తెరపైకి కత్రీనా కైఫ్ సోదరి... తొలిచిత్రం

Sep 18, 2018 19:54 by Admin Admin

బాలీవుడ్ నటి, తెలుగులో హీరో వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ చిత్రంలో నటించిన కత్రీనా కైఫ్ సోదరి ఇసాబెల్ కైఫ్ తెరంగ్రేట్రం చేస్తోంది. ఇటీవలే ఆమె తన కో- స్టార్ సూరజ్ పంచోలీ‌తో కొరియోగ్రాఫర్ స్టాన్లీడీకోస్టా సినిమా ‘టైమ్ టూ డాన్స్’ షూటింగ్ పూర్తిచేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భూషణ్ కుమార్, రెమో డిసౌజా ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో 1991లో వచ్చిన ఒక సినిమా పాటను రీక్రియేట్ చేస్తున్నారు. పూజాభట్, అమిర్‌ఖాన్ జంటగా వచ్చిన ‘దిల్ హై కీ మాన్తా నహీ’ చిత్రంలోని ‘ఆదాయేం భీ హై’ పాటను రీక్రియేట్ చేస్తున్నారు. ఈ పాటను ఇసాబెల్, సూరజ్ పంజోలీలపై ఇంగ్లాండ్‌లో చిత్రీకరిచారు. ఈ పాటలో కొత్తదనం తీసుకు వచ్చేందుకు లిరిక్స్, బీట్స్, మ్యూజిక్‌లలో మార్పులు తీసుకు వచ్చారని తెలుస్తోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe