Breaking News

సికింద్రాబాద్‌ to విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

Sep 20, 2018 19:11 by Admin Admin

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
 విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెం: 08501) విశాఖపట్నం నుంచి నవంబర్‌ 6, 13, 20,27, డిసెంబర్‌ 4, 11, 18, 25వ తేదీల్లో రాత్రి 11గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌-విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెం: 08502) సికింద్రాబాద్‌ నుంచి నవంబర్‌ 7, 14, 21, 28, డిసెంబర్‌ 5, 12, 19, 26వ తేదీల్లో సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe