Breaking News

వివేకానందుని స్ఫూర్తితో

Sep 26, 2018 07:27 by Admin Admin

వేకానంద ఆశయాలు అమలయ్యేలా చూడాలన్న తపన..సమాజానికి ఏదైనా చేయాలన్న నిండు హృదయం.. 
వెరసి ఓ కంపెనీ సెక్రటరీని ఎన్జీఓ ప్రారంభించేలా చేసింది.  వృత్తిరీత్యా హైదరాబాదులో ఉన్నప్పటికీ స్వస్థలం ఖమ్మంలో 2012లో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ పేరుతో ఈ సంస్థను ప్రారంభించి పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.  రామకృష్ణ మఠంను ఆదర్శంగా తీసుకుని చేపడుతున్న అవగాహనా శిబిరాలు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఖమ్మం వాసులకు వివేకానందుని స్ఫూర్తిని చేరువ చేస్తున్నారు. 

నిత్య విద్యార్థుల కోసం..
ఖమ్మం నగరంలో ‘శ్రద్ధ’ పేరుతో ప్రతి వారం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పలు అంశాలపై చిన్నారులకు ట్రైనింగ్ ఇవ్వడం, అవగాహన పెంచే కార్యక్రమాలు సంస్థ చేపడుతోంది. యోగా, మార్షల్ ఆర్ట్స్, కరాటే, హస్త కళలు, వ్యక్తిత్వ వికాసం, మన వ్యవసాయం వంటి విషయాలపై పరిజ్ఞానాన్ని పెంచేలా వివేకానంద సంస్థ చర్యలు చేపడుతోంది.  ఇప్పటి వరకూ 30వేల మందికి పైగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసంలో శిక్షణనిచ్చారు. బాల్యంలోనే ఇలాంటి అంశాలపై పిల్లలకు తర్పీదునిస్తే భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా తయారవుతారన్నది ఈ సంస్థ ఆశయంగా ఉంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe