Breaking News

బాడీ బిల్డింగ్‌లో జాతీయస్థాయి పతకాన్ని అందుకుంది

Oct 03, 2018 19:05 by Admin Admin

భార్యను గాలికొదిలేసిన భర్త.. తెల్లారితే జీవితం ఎలా గడుస్తుందోనని దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద మహిళ, మరోవైపు బాబు..అంతే ఏదైనా సాధించితీరాలన్న కసి రగిలింది. భర్త నుంచి విడిపడక తప్పని బాధలో తల్లి ఆసరాతో కుమారుడిని చూసుకుంటూ.. తాను చేస్తున్న టీచర్ ఉద్యోగాన్ని కూడా మాని బాడీ బిల్డింగ్‌కే పరిమితమైంది. బాడీ బిల్డింగ్‌లో జాతీయస్థాయి పతకాన్ని అందుకుంది..6 ఏళ్ల బాలుడికి తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఫిట్నెస్ గోల్స్ సాధించి, స్పోర్ట్స్ స్టార్‌గా ఎదిగిన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాడీ బిల్డింగ్ కారణంగా తనలో మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసం తన్నుకొచ్చిందని, ఫిట్నెస్‌లో ఉన్న మ్యాజిక్ ఇదేనంటూ రూబీ వివరిస్తున్నారు

నిత్యం అలుపెరుగని బాటసారిలా నడక ప్రారంభించడంతో 2015లో నా ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ అయింది.. రోజూ 10 కిలోమీటర్ల నడకతో ఎక్కువ బరువు కోల్పోయా..4 నెలల వ్యవధిలో 75 కేజీల నుంచి 50 కేజీలకు చేరుకున్నా’’ అనే రూబి బిడ్డకు జన్మనిచ్చాక తన బరువు మరింత పెరగడంతో అసలు కష్టాలు ప్రారంభమయ్యాయంటారు.  జుంబా క్లాసులు కూడా హాజరవుతూ తన దినచర్యను మరింత ఉల్లాసంగా ఉండేలా జాగ్రత్తపడిన రూబి గువహటిలో ఇటీవల జరిగిన ఐఎఫ్‌ఏ క్లాసిక్ నేషనల్ ప్రో-ఏఎం చాంపియన్‌షిప్-బాడీబిల్డింగ్ అండ్ ఫిట్నెస్ టైటిల్ గెలిచి తన ఉనికిని చాటుకున్నారు. ‘‘మిస్ ఫిట్నెస్ చెన్నై’’ టైటిల్ సైతం ఖాతాలో వేసుకుని బాడీబిల్డింగ్‌లో తన ప్రత్యేకత చాటుకున్నారు. రూబీ అతి త్వరలో ‘మిస్  ఫిట్నెస్ ఇండియా’ టైటిల్ సైతం గెలిచితీరుతుందని ఆమె కోచ్ కార్తీక్ విశ్వాసం వ్యక్తంచేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe