Breaking News

మీ కాళ్లదగ్గరికి తెచ్చి చీరలు మీ చేతులో పెడతాం

Oct 04, 2018 10:32 by Admin Admin

ముఖ్యమంత్రి కేసీఆర్ మనవి చేశారు. "తెలంగాణ ఆడపడుచులు పాపం.. బతుకమ్మ వస్తే పండుగ చేసుకుంటారు. ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్ఎస్.. మహిళలను గౌరవించి 90లక్షల చీరలు పంచమంటే కొందరు కోర్టుకు వెళ్లారు. గూడురు నారాయణరెడ్డి అనే భువనగిరికి చెందిన వ్యక్తి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఆడపిల్లల నోటికాడ కూడు గుంజేసి చీరలు పంచొద్దని చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన ఉండి.. దసరాలోపు మేం చీరలు పంచలేకపోయినా ఎన్నికల కోడ్ ఎత్తేసిన తెల్లారే మీ ఊర్లోనే.. మీ కాళ్లదగ్గరికి తెచ్చి చీరలు మీ చేతులో పెడతాం. మీరేం రంది పడకండిఅని తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ మనవి చేశారు. రేపట్నుంచి అనగా శుక్రవారం నుంచి రైతుబంధు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe