Breaking News

సీఈఓ చందా కొచ్చర్ స్వచ్ఛంద పదవీ విరమణ

Oct 04, 2018 10:47 by Admin Admin

సీఈఓ చందా కొచ్చర్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) విజ్ఞప్తిని ఐసీఐసీఐ బ్యాంక్ ఆమోదించింది. కొచ్చర్ స్థానంలో నూతన ఎండీ, సీఈవోగా సందీప్‌ భక్షి నియమితులయ్యారు.

కాగా వీడియోకాన్‌ సంస్థకు 3 వేల 250 కోట్ల రుణ వ్యవహారంలో చందా కొచ్చర్‌ సాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.  వీడియోకాన్‌కు రుణాలు అందించినందుకు ప్రతిగా.. ఆమె భర్త సంస్థలోకి వీడియోకాన్‌ నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై బ్యాంకు స్వతంత్రంగా విచారణ చేపట్టిన విషయం విదితమే. దీంతో ఆమె ఈ ఏడాది మే నెల నుంచి సెలవులోనే ఉన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe