Breaking News

కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

Oct 06, 2018 11:18 by Admin Admin

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌  శనివారం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన  పోస్టర్లు, హోర్డింగ్‌లు తొలగించాలని,

ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ ప్రకటనలు ఉండకూడదని సూచించారు.

ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదని తెలిపారు. 

24 గంటల్లో రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, విమానాశ్రయాల్లో బ్యానర్లన్నీ తొలగించాలని ఆదేశించారు. 

బహిరంగ ప్రదేశాల్లో జెండాలు, హోర్డింగ్‌లను 48 గంటల్లోగా తొలగించాలని,

ప్రవేటు స్థలాల్లో యజమాని అనుమతితోనే బ్యానర్లు, గోడపత్రికల వంటివాటిని ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి లేకుంటే 72 గంటల్లోగా తీసివేయాలని కోరారు.  ప్రతి జిల్లాలో, సీఈవో కార్యాలయంలో 24 గంటల కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు.

 

 

కొత్త ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమని రజత్ కుమార్ వ్యాఖ్యానించారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe