Breaking News

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Oct 07, 2018 18:42 by Admin Admin

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది.

తమిళనాడు, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.

దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఆవరించిన ఆవరణ ప్రభావంతో ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి వాయువ్యదిశగా పయనించి ఒడిసాకు రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe