Breaking News

కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

Oct 07, 2018 18:49 by Admin Admin

కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.  ఈసారి బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆహ్వానం లభించింది. నవంబర్ 6,  7 తేదీల్లో సింగపూర్‌లో జరగనున్న ఫోరం సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు , వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్పులను చర్చించేందుకు నూతనంగా ఏర్పాటు చేయనున్న న్యూ ఎకానమీస్ ఫోరం ప్రారంభానికి వ్యవస్థాపక ప్రతినిధిగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పలికారు.

ఈ సమావేశంలో నగరీకరణ , పట్టణ మౌలిక వసతులు, ఐటీ రంగాలపై మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.  

ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహక అధికారులు, 

వివిధ దేశాల రాజకీయ నాయకులు, వక్తలు హాజరు కానున్నారు. గత నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధితోపాటు, తన పరిపాలనా విధానాల ద్వారా సమాజంలోని అసమానతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై కేటీఆర్ ఈ ఫోరం సదస్సులో ప్రసంగిస్తారు. 

తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో ప్రజల సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం తీసుకున్న అనేక చర్యలకు దక్కిన గౌరవంగా మంత్రి పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe