Breaking News

ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు

Oct 08, 2018 09:43 by Admin Admin

గులాబీ పార్టీ ఇప్పటికే మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి కేడర్‌లో జోష్ నింపిన కె సి ఆర్ ఇక నుంచి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు.  50 రోజుల ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక నుంచి జిల్లా స్థాయి సభలు కాకుండా నియోజకవర్గాల్లోనే భారీగా సభలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. రోజుకు కనీసం రెండు సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మంత్రుల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. తర్వాత పార్టీ అభ్యర్థులు ఎక్కడ బలహీనంగా ఉన్నారో ఆ నియోజక వర్గాల్లో దృష్టి సారించి అక్కడే ఎన్నికల సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe