Breaking News

రికార్డులు బద్దలు కొడుతోందని ధీమా

Oct 11, 2018 08:32 by Admin Admin

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం..  హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ సినిమా యూనిట్, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అరవింద సమేతకు వస్తున్న రెస్పాన్స్‌పై హీరో ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన అభిమానులతో పాటు మద్దతుగా నిలిచిన మీడియాకు థ్యాంక్స్ చెప్పారు. అటు చిత్ర యూనిట్‌కి పేరు పేరున అభినందనలు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే ఈ సినిమా విజయం సాధించిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe