Breaking News

గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

Oct 13, 2018 10:18 by Admin Admin

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. గ్రూప్-2 రాత పరీక్షలో సరిగా బబ్లింగ్ చేయని, వైట్‌నర్ ఉపయోగించిన వారిని ఇంటర్వ్యూలకు అనుమతించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో డబుల్ బబ్లింగ్ ఉన్న ఆన్సర్‌షీట్‌లను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూ లకు ఎంపికైన వారిలో డబుల్ బబ్లింగ్ చేసిన వారిని తొలగించి.. మిగతా వారికి ఇంటర్వ్యూ నిర్వహించేందుకు కోర్టు అనుమతిస్తూ తీర్పును వెల్లడించింది. వైట్‌నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని హైకోర్టు తొలగించింది. ఇదిలావుంటే.. గ్రూప్-2 పరీక్షల్లో ఇంటర్వ్యూలకు 3147 మంది అర్హత సాధించారు. వీరికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో  హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డితో పలువురు వేర్వేరు పిటిషన్ల ద్వారా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు వైట్‌నర్, డబుల్ బబ్లింగ్ చేసిన వారికి మినహాయించి మిగిలిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహించాలని తీర్పునిచ్చారు. దీంతో 267 మంది అభ్యర్థులను తొలగించగా, 2880 మందికి 1:2 పద్దతిలో ఇంటర్వ్యూలను నిర్వహించాలని స్పష్టం ఆదేశించింది. 2016 సెప్టెంబర్‌లో 1032 పోస్టులతో గ్రూప్-2 ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016, నవంబర్ 11, 13 తేదీల్లో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఓంఎఆర్ షీట్ల పరిశీలనకు సీనియర్ న్యాయవాదులు పి.రఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలతో న్యాయవాదుల కమిటీని నియమించింది. ఆ కమిటీ తొలి ఐదు వేల మంది అభ్యర్థుల ఓంఎఆర్ షీట్లను పరిశీలించింది. లోతుగా విచారణ చేపట్టిన అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe