Breaking News

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ మృతి

Oct 20, 2018 21:34 by Admin Admin

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్ రూంకు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్ మృతదేహం నిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ఆయన కుమారుడు, కూతురు అమెరికాలో ఉండడంతో వారు వచ్చే వరకు మృతదేహాన్ని నిమ్స్‌లోని మార్చురీలోనే ఉంచుతారు. 'మా' తరుపున వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు 'మా' అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe