Breaking News

రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత

Oct 22, 2018 07:09 by Admin Admin

విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో దుమ్మురేపిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌లో 117 బంతుల్లోనే 152 పరుగులు చేసిన రోహిత్ వన్డేల్లో ఆరుసార్లు 150కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.
ఇప్పటి వరకు 189 వన్డేలు ఆడిన రోహిత్‌కు ఇది 20వ సెంచరీ. ఇందులో ఆరుసార్లు 150కిపైగా పరుగులు చేశాడు.
 
నవంబరు 2013లో ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 209 పరుగులు చేశాడు. 
 
నవంబరు 2014లో కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. 
 
అక్టోబరు 2015లో కాన్పూరులో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 150 పరుగులు చేశాడు. 
 
జనవరి 2016లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 171(నాటౌట్) పరుగులు చేశాడు. 
 
డిసెంబరు 2017లో మొహాలీలో శ్రీలంకపై 208(నాటౌట్) పరుగులు సాధించాడు. 
 
తాజాగా గువాహటిలో విండీస్‌పై 152(నాటౌట్) పరుగులు చేశాడు. 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe