Breaking News

ఉత్కంఠభరిత పోరులో రెండో వన్డే టై

Oct 24, 2018 10:31 by Admin Admin

ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. వెస్టిండీస్‌కు 322 పరుగుల భారీ టార్గెట్‌ను ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 4, కెప్టెన్ విరాట్ కోహ్లీ 157, రాయుడు 73, ధోనీ 20, ధావన్ 29, రిషబ్ పంత్ 17, జడేజా 13 పరుగులు చేశారు.

రెండో వన్డే టై అయ్యింది. ఉత్కంఠభరిత పోరులో విండీస్ బ్యాట్స్‌మెన్ గెలుపు వాకిట నిలిచిపోయారు. 322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. విండీస్ బ్యాట్స్ మెన్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. ఓపెనర్లు కీరన్ పావెల్(18), హేమ్ రాజ్(32) జోడీ శుభారంభాన్నిచ్చింది. ఆ తర్వాత వచ్చిన హోప్(123 నాటౌట్) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హోప్‌కు షిమ్రోన్ హిట్ మెయిర్(94) జత కలవడంతో భారత విజయ అవకాశాలు ఆవిరయ్యాయి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, షమీ, ఉమేశ్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe