Breaking News

బందోబస్తు మధ్య క్షేమంగా రిజర్వు బ్యాంకుకు

Oct 26, 2018 17:01 by Admin Admin

మూడు కంటైనర్లు చెన్నై రిజర్వు బ్యాంకుకు వెళ్తున్నాయి.. వాటినిండా తలతలలాడే రూ.2వేల నోట్ల కట్టలు.. విలువ రూ.2 వేల కోట్లు ఉంటుంది.. ఒక్కసారిగా చివరి కంటైనర్‌ ఇంజన్‌లో లోపం తలెత్తింది. అక్కడికక్కడే నడిరోడ్డుపై ఆగిపోయింది.

అసలే అర్ధరాత్రి.. పైగా వేల కోట్ల నోట్ల కట్టలు.. హుటాహుటిన అధికారులకు సమాచారం అందించడంతో వందలాది మంది సాయుధ దళ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తుపాకులు పట్టి కంటైనర్‌ చుట్టూ మోహరించి నిఘా పెట్టారు. ఆ దిశగా వచ్చే ఏ ఒక్క వాహనాన్నీ అటుగా రానివ్వలేదు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe