Breaking News

రాష్ట్రంలో ముందు నీ పదవి కాపాడుకో.

Oct 28, 2018 19:08 by Admin Admin

రాష్ట్రంలో ముందు నీ పదవి కాపాడుకో... తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఎద్దేవా చేశారు. గుంటూరులో ఆదివారం రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో గరుడ పురాణ కాలక్షేపం జరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రె్‌సను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాయావతి కాళ్ల వద్ద కూర్చున్నారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తోంది’ అని చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe